Author: Nastik Surya
Ramesh Vignana Darshini గారు ఈ ప్రోగ్రాం చేద్దాం అన్నప్పుడు నాకు చాలా సందేహాలు వచ్చాయి. ముఖ్యంగా మనం మంచి చేయబోయి చెడు అవుతామేమో అని. తర్వాత చాలా డిస్కస్ చేసి, ఒక టీం వర్క్ గా కొన్ని నిభందనలు పెట్టుకొని స్టార్ట్ చేస్తే…
మొదలు పెట్టిన గంటలోనే చాలా కాల్స్ వచ్చాయి.
అదీ ఎక్కడో ఒక మారుమూల సోమ్లా తండా నుండి (గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ) కాల్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ వచ్చింది, సింటమ్స్ ఏమీలేవు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం మెడిసిన్ వాడాలని…
వాలంటీర్ డాక్టర్ గారితో మాట్లాడించి తగు సూచనలు ఇప్పించారు.
అంతే కాకుండా ఆ తండాలో మొత్తం 30 యాక్టీవ్ కేసులు ఉన్నాయని సమాచారం కూడా తెలిసింది. వాళ్లకి ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉంటామని చెప్పడం తోపాటు, కొంత సామాగ్రి కూడా అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మిగిలిన కాల్స్ కన్నా ఈ కాల్ తో ఉన్న సందేహాలన్నీ తీరిపోయి, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చింది అందరికీ. ఇదేమీ ఖర్చుతో కూడుకున్నది కాదు. జస్ట్ ఒక కోర్డినేషన్ అంతే… ఎంతోమందికి, మారూమూల ప్రాంతాలలోని వాళ్ళకీ డాక్టర్స్ సలహాలు అందుతున్నాయి. దీన్ని నిరంతరంగా, అవసరం ఉన్నంతవరకూ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రమేష్ గారిని కోరుతున్నా. ఈ సమయంలో కూడా, ఎంతో సంపాదించుకొనే అవకాశం ఉన్నాకూడా ఉచితంగా సలహాలూ, సూచనలు ఇస్తున్న డాక్టర్స్ ఉండడం నిజంగా అభినందనీయం. వాళ్లకి నా శాల్యూట్.
మీరూ చేయగలిగిన సహాయం, మీ చుట్టూ ఉన్నవాళ్ళకి, అవసరంలో ఉన్నవాళ్ళకి చేయాలనీ కోరుతున్నా….